హన్మకొండ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ నివాసాలపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో సోదాలు నిర్వహించింది. శుక్రవారం ఉదయం నుంచి అర్ధ రాత్రి వరకు వరంగల్, ఆయన స్వస్థలం జగిత్యాలతోపాటు మొత్తం ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల సమయంలో పలు ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు గుర్తించిన అధికారులు. రూ.2.79 కోట్ల విలువైన మూడు ఇళ్లు, 13 .57 లక్షల…