Vijay Diwas: డిసెంబర్ 16, 1971న దాయాది దేశం పాకిస్తాన్ భారత్ ముందు మోకరిల్లింది. తమను రక్షించాలని ప్రాధేయపడింది. పాకిస్తాన్ నుంచి కొత్త దేశంగా బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైన ఈ యుద్ధం పాకిస్తాన్ భూభాగాన్ని సగం చేసింది. ఏకంగా 90,000 మంది పాకిస్తాన్ సైనికులతో పాటు పాక్ తూర్పు కమాండ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ భారత్ ముందు లొంగిపోతూ, లొంగుబాటు పత్రంపై సంతకం చేశాడు. భారత లెఫ్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా, బంగ్లాదేశ్…