పహల్గాంలో టూరిస్టులపై కాల్పులు జరిపి కుటుంబాల్లో శోకాన్ని నింపిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులను ఏరివేసేందుకు రెడీ అయ్యింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లిన భారత దళాలు వైమానిక దాడులు నిర్వహించి తిరిగి వచ్చాయి. ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని ప్రకటించాయి. అయితే పాకిస్తాన్‌లో భారత వైమానిక మొదటి దాడి జరిగిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. Also…