Israel: ఇజ్రాయిల్ ఢిపెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) గాజాలోని హమాస్ పై ప్రతీకార దాడులు చేస్తోంది. గత శనివారం హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై క్రూరమైన దాడిని చేశాయి. ఆ దాడిలో 1300 మంది ఇజ్రాయిలీలు చనిపోగా.. పలువరిని బందీలుగా చేసుకున్న హమాస్ ఉగ్రవాదులు వారిని గాజాలోకి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ వైమానికి దళం గాజా స్ట్రిప్ పై నిప్పుల వర్షాన్ని కురిపిస్తోంది.