స్మార్ట్‌ఫోన్లు వచ్చిన దగ్గరి నుంచి కీప్యాడ్ మొబైల్ల డిమాండ్ తగ్గిపోయింది. ఎవరి చేతిలో చూసినా ఇప్పుడు స్మార్ట్ ఫోన్లే కనపడుతున్నాయి. ఎక్కడో పల్లెటూర్లలో, స్మార్ట్ ఫోన్ ను ఎలా వాడాలో తెలియని వాళ్ల దగ్గరే కీప్యాడ్ మొబైల్స్ దర్శనమిస్తున్నాయి. అయితే ఇప్పుడు కీప్యాడ్ మొబైల్ వాడే వారికి ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. కీప్యాడ్ మొబైల్‌లపై పండగ ఆఫర్ సందర్భంగా కొన్ని మొబైల్ కంపెనీలు భారీగా ధరలు తగ్గిస్తున్నారు.