California shooting: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పులు చోటు చేసుకున్నాయి. లాస్ ఏంజిల్స్ కాల్పుల ఘటనలో 11 మంది మరణించి 48 గంటలు లోపే మరో సంఘటన జరిగింది. శాన్ ఫ్రాన్సిస్కోకు దక్షిణంగా ఉత్తర కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బేలోని రెండు చోట్ల దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. ఇందులో రెండు కాల్పులు జరిగాయి. ఏడుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పనిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.…