వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు ఆలయంపై నిర్మించబడిందా లేదా అని నిర్ధారించడానికి సర్వే నిర్వహించాలని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ)ను ఆదేశించిన జిల్లా కోర్టు ఉత్తర్వులపై అలహాబాద్ హైకోర్టు బుధవారం విచారణ ప్రారంభించింది.
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో జులై 26 వరకు ఎలాంటి సర్వే నిర్వహించవద్దని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. పరిష్కారాల కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని ముస్లిం పిటిషనర్లను ఆదేశించింది.