Home
Gyanvapi Mosque
Gyanvapi Mosque News
-
Gyanvapi Mosque: “జ్ఞానవాపి మసీదు నిజానికి శివాలయమే”.. యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు..
Gyanvapi Mosque: వారణాసిలో ‘‘జ్ఞానవాపి’’ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ వివాదంపై ఇటు హిందూ సంఘాలు, అటు మసీద్ కమిటీ మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. ఇదిలా ఉంటే యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ జ్ఞానవాపి మసీదు కాదని, అది శివాలయమే అని అన్నారు. శనివారం వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదును ముస్లింల ప్రార్థనా స్థలంగా పిలువడంపై తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, అది 'శివుని దేవాలయం' అని చెప్పారు. -
Gyanvapi: జ్ఞానవాపీ మసీదు సర్వేకి ఆదేశించిన జడ్జికి బెదిరింపు కాల్స్..
Gyanvapi: జ్ఞానవాపీ మసీదు వివాదంలో ఆ ప్రాంతాన్ని సర్వే చేయాలని 2022లో ఆదేశాలు జారీ చేసిని వారణాసి అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రవి కుమార్ దివాకర్‌కి అంతర్జాతీయ నెంబర్ల నుంచి చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. -
Gyanvapi Case: జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో హిందువుల పూజలపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..
Gyanvapi Case: జ్ఞానవాపి మసీదు వివాదంలో అలహాబాద్ హైకోర్టు తన తీర్పు రిజర్వ్ చేసింది. ఇటీవల జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సెల్లార్లో హిందువులు పూజలు చేసుకునేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, వారణాసి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ని ఈ రోజు జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ విచారించారు. కోర్టు తన ఉత్తర్వులను రిజర్వ్ చేశారని కమిటీ తరుపున వాదిస్తున్న ఎస్ఎఫ్ఏ నఖ్వీ తెలిపారు. -
Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షానికి ఎదురుదెబ్బ.. పూజల కొనసాగింపుకే హైకోర్టు మొగ్గు..
Gyanvapi Case: జ్ఞానవాపీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వారణాసి కోర్టు దక్షిణ సెల్లార్లో హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంతో, ముస్లిం పక్షం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, పూజలు కొనసాగించేందుకే హైకోర్టు మొగ్గు చూపించడంతో ముస్లిం పక్షానికి ఎదురుదెబ్బ తాకినట్లైంది. -
Gyanvapi: 31 ఏళ్ల తర్వాత జ్ఞానవాపిలో మొదలైన పూజలు
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గల జ్ఞానవాపి మసీదులోని సెల్లార్లో గల విగ్రహాల ముందు పూజారి ప్రార్థనలు చేయవచ్చని వారణాసి జిల్లా కోర్టు బుధవారం తీర్పు ఇచ్చిన కొన్ని గంటల తర్వాత, అర్ధరాత్రి జ్ఞానవాపి ప్రాంగణంలో పూజలు ప్రారంభమయ్యాయి. -
Breaking: జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో పూజలు చేసేందుకు హిందువులకు కోర్టు అనుమతి
జ్ఞానవాపి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. జ్ఞానవాపి మసీదులో పూజలు చేసేందుకు హిందువులకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది. -
Gyanvapi Mosque: జ్ఞానవాపిని హిందువులకు అప్పగించండి.. ఏఎస్ఐ నివేదిక తర్వాత వీహెచ్‌పీ..
Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) నివేదిక సంచలనంగా మారింది. ఏఎస్ఐ సర్వేలో మసీదుకు ముందు అక్కడి పెద్ద హిందూ దేవాలయం ఉండేదని తేలింది. వారణాసి కోర్టు ఏఎస్ఐ నివేదికను బహిరంగపరచాలని, ఇరు పక్షాలకు రిపోర్టును అందించాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ సర్వేకి చెందిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే సర్వే తర్వాత విశ్వహిందూ పరిషత్(VHP) జ్ఞానవాపి నిర్మాణాన్ని హిందువులకు అప్పగించాలని కోరింది. -
Gyanvapi Case: శివలింగం, విరిగిన దేవతా విగ్రహాలు, తెలుగు శాసనాలు.. జ్ఞానవాపి మసీదు ఏఎస్ఐ సర్వేలో కీలక విషయాలు..
Gyanvapi Case: వారణాసిలోని జ్ఞానవాపి మసీదుకు సంబంధించి ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) సర్వే సంచలనంగా మారింది. వారణాసి కోర్టు ఆదేశాల మేరకు ఏఎస్ఐ రిపోర్టును బహిరంగపరచడం జరిగింది. ఇప్పటికే రెండు వర్గాలకు ఈ రిపోర్టు అందింది. నిన్న హిందూ పక్షం న్యాయవాది విష్ణు శంకర్ జైన్ రిపోర్టులోని అంశాలను మీడియాకు వెళ్లడిస్తూ.. అక్కడి మసీదుకు పూర్వం పెద్ద హిందూ ఆలయం ఉండేదని ఏఎస్ఐ రిపోర్టు సూచిస్తుందని వెల్లడించారు. -
Gyanvapi Case: జ్ఞానవాపి మసీదుకు ముందు అక్కడ పెద్ద హిందూ దేవాలయం ఉంది.. ఏఎస్ఐ సర్వేలో సంచలన విషయాలు..
Gyanvapi Case: ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు సముదాయంలో మసీదుకు పూర్వం పెద్ద హిందూ దేవాలయం ఉందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) నివేదిక సూచిస్తోందని హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ గురువారం పేర్కొన్నారు. మసీదు నిర్మించేందుకు ఆలయాన్ని ధ్వసం చేసినట్లు నివేదిక సూచిస్తోందని జైన్ అన్నారు. -
Gyanvapi Mosque: నేడు జ్ఞాన్వాపీ ఏఎస్ఐ సర్వే నివేదికపై వారణాసి కోర్టు తుది తీర్పు
జ్ఞాన్వాపీ ఆర్కియాలజీ సర్వే నివేదికపై వారణాసి కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఏఎస్ఐ సర్వే రిపోర్టును బహిరంగపరచాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించనుంది.
తాజావార్తలు
-
Tilak Varma: ఎవరికీ సాధ్యం కాలేదు.. బ్యాటింగ్ చేయకుండానే తిలక్ వర్మ ప్రపంచ రికార్డు..
-
Aneet Padda: టాలీవుడ్లోకి ‘సైయారా’ బ్యూటీ ఎంట్రీ?
-
CM Chandrababu: రాజకీయ నేతలే నేరాలకు పాల్పడే పరిస్థితి..! చంద్రబాబు ఫైర్
-
Donald Trump: ట్రంప్‌ను జైల్లో బంధించిన ఇరాన్..? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
-
Team India: మాకు విశ్రాంతి వద్దు, ప్రతి మ్యాచ్ ఆడుతాం.. టీమిండియా సీనియర్ ప్లేయర్స్ భయం అదేనా?
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!