Botsa Satyanarayana: విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూములపై వైసీపీ నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జీవీఎంసీ ధర్నా చౌక్ దగ్గర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన దీక్ష చేపట్టారు. గీతం యూనివర్సిటీకి సంబంధించిన భూ దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులు ఈ ధర్నాకు దిగాయి.