ధాన్యం సేకరణలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలో అవకతవకలు జరిగాయని మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. శుక్రవారం రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. అవకతవకలు, ఆలస్యంగా రైతులకు చెల్లింపులపై కేంద్రం విచారణ చేపట్టాలన్నారు. ఎంపీ జీవీఎల్ నరసింహా రావు అడిగిన ప్రశ్నకు పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ వరి ధాన్యం సేకరణలో అవకతవకలు జరుగుతున్నాయని ధృవీకరించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలనే విచారణ చేయాలని కోరినట్లు మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలే…