వైసీపీ మాజీ మంత్రి, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే... గుమ్మనూరు జయరాం, ఆయన కుటుంబ సభ్యుల వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటోంది. పార్టీలు మారినా... వాళ్ళ వివాదాస్పద తీరు మాత్రం మారదా అన్న చర్చలు నడుస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. నిత్య వివాదం లేకుంటే వీళ్ళకు నిద్ర పట్టదా అని కూడా మాట్లాడుకుంటున్నారట.