ప్రముఖ రాజకీయ నాయకుడు, పేద ప్రజల పక్షపాతిగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర వెండితెరకెక్కనుంది. ‘గుమ్మడి నర్సయ్య’ పేరుతో తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌లో కన్నడ చక్రవర్తి డా. శివ రాజ్ కుమార్ టైటిల్ రోల్ పోషిస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్. సురేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరమేశ్వర్ హివ్రాలే ఈ…