ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దేశంలో మహిళా ఎంపీల తగ్గుదల అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం పెరిగినా, మహిళా ఎంపీలుగా ఎన్నికైనవారి సంఖ్య తగ్గడం గమనార్హం. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 73 మంది మహిళా అభ్యర్థులు ఎన్నిక కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ సంఖ్య 78గా ఉంది.