Digital Arrest Scam: గుజరాత్‌లోని ఓ మహిళా వైద్యురాలు డిజిటల్ అరెస్ట్ స్కామ్‌కు గురి అయ్యింది. దీనితో తన జీవితాంతం సంపాదించిన రూ. 19 కోట్లు కేవలం 90 రోజుల్లోనే కోల్పోయింది. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మార్చిలో మొదలైన ఈ మోసం అత్యంత ప్రణాళికతో జరిగినట్లు పోలీసు దర్యాప్తులో బయటపడింది. ఈ ఘటనలో మొదట డాక్టర్‌కు “జ్యోతి విశ్వనాథ్” అనే మహిళ ఫోన్ చేసి, తాను టెలికాం విభాగానికి చెందినవారని చెప్పింది. ఆ…