అమరావతి: డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. గుడివాడ ఆర్ఐపై మట్టి మాఫియా ఎదురు కేసు పెట్టడంపై లేఖలో వర్ల రామయ్య అభ్యంతరం తెలిపారు. అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారిపైనే కేసు పెట్టారంటే మట్టి మాఫియా ఎంత శక్తివంతంగా ఉందో తెలుస్తోందని వర్ల రామయ్య ఆరోపించారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడి రెవెన్యూ అధికారిపై దాడి చేసిన మాఫియాను అరెస్టు చేయకుండా బాధితుడైన ఆర్ఐపై కేసు నమోదు చేయడం…