Increase on GST మజ్జిగ మీద జీఎస్టీ, పాలు మరగబెట్టి పెరుగు తోడుపెడితే జీఎస్టీ. ఇప్పటికే కరోనా, అధిక ద్రవ్యోల్బణంతో సతమతమౌతున్న జనానికి.. పన్నుల మోత తప్పడం లేదు. జీఎస్టీ, డీజిల్ సెస్, లైఫ్ ట్యాక్స్.. పేరేదైనా భారం తప్పడం లేదు. కష్టకాలంలోనూ ఆదాయాలు తగ్గకుండా చూసుకుంటున్న ప్రభుత్వాలు.. అందుకు పన్నులే మార్గమని ఫిక్సౌతున్నాయి. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టకుండా ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. అధిక పన్నులతో ఆర్థిక విధ్వంసం తప్పదని నిపుణులు మొత్తుకుంటున్నా.. వినేవాళ్లు ఎవరూ…