హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సరూర్ నగర్ పరిధిలో జీఎస్టీ అధికారుల కిడ్నాప్ కలకలం రేపింది. ఈ కిడ్నాప్ కేసును పోలీసులు చేధించిన ఘటనపై కేంద్రం సీరియస్ అయింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల కిడ్నాప్ ఘటనపై తెలంగాణ పోలీసులను ఆరా తీశారు. అధికారుల కిడ్నాప్ ఉదంతాన్ని తీవ్రంగా ఖండించిన ఆమె.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ ను ఫోన్‌లో కోరింది.