ఇది ఒక్క ఏడాది సంభవించిన కరువు కథ కాదు. ఒక్క నగరంలో నీళ్లు ఇంకిపోయిన వార్త కూడా కాదు. భూమి మీద నీరు దివాలా తీస్తోందని ఐక్యరాజ్యసమితి అధికారికంగా హెచ్చరిస్తున్న క్షణం ఇది. నీరు దివాలా తియ్యడమేంటని ఆలోచిస్తున్నారా? ఈ పదం వినియోగించడానికి ఒక బలమైన కారణముంది. ఐక్యరాజ్యసమితి యూనివర్సిటీ నివేదిక ఒక కొత్త పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. అదే ‘వాటర్ బ్యాంక్‌రప్సీ..’! అంటే నీరు దివాలా తియ్యడమని అర్థం. నదులు, భూగర్భ జలాలు, సరస్సులు…
కట్టుతప్పుతున్న భూతాపం, వాతావరణ మార్పుల మూలంగా ఇటీవల కుండపోత వానలు విరుచుకుపడుతున్నాయి. వాటివల్ల విపరీతమైన జనసాంద్రత కలిగిన భారతీయ నగరాలు వరదల గుప్పిట చిక్కి విలవిల్లాడుతున్నాయి. రోడ్లపైకి భారీగా వాననీరు చేరి కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయి స్థానికులు నరకం అనుభవిస్తున్నారు.