చాలా సందర్భాల్లో పెళ్లికొడుకు పొట్టిగా ఉన్నాడనో, నల్లగా ఉన్నాడనో, చెడు అలవాట్లు ఉన్నాయనో, అతడి బ్యాక్‌గ్రౌండ్ బాగా లేదనో.. వధువులు పెళ్లి రద్దు చేసిన ఘటనలు చూసి ఉంటారు. ఎక్కడైనా అలాంటి వార్తలు చదివుంటారు. కానీ వరుడి ముక్కు చిన్నగా ఉందని ఓ వధువు ఏకంగా పెళ్లిని క్యాన్సిల్ చేసింది.