Hindu Temple Attack: అమెరికాలో హిందూ దేవాలయాలపై దాడులు ఆగడం లేదు. ఈ వారం ప్రారంభంలో ఇండియానా రాష్ట్రంలోని గ్రీన్‌వుడ్ నగరంలో ఉన్న BAPS స్వామినారాయణ ఆలయం కొందరి దుర్మార్గులకు లక్ష్యంగా మారింది. ఆగస్టు 10న చోటుచేసుకున్న ఈ ఘటనను ఆలయ అధికారిక ప్రజా వ్యవహారాల విభాగం “ద్వేషపూరిత చర్య”గా అభివర్ణించింది. అలాగే చికాగోలోని భారత కాన్సులేట్ ఈ చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించి ఒక ప్రకటనలో ఆలయం ప్రధాన సైన్ బోర్డును అపవిత్రం చేయడం…