తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన సమావేశం కొనసాగింది. సుమారు రెండున్నర గంటల పాటు భేటీ జరిగింది. జీహెచ్ఎంసీ మేయర్ పై అవిశ్వాసంతో పాటు పలు రాజకీయపరమైన అంశాలపై చర్చ జరిగింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ ఎమ్మెల్యేలు లంచ్ భేటీ అయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది.