Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సెకండ్ పార్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ కట్ ఒక్కసారిగా ఆ అంచనాలను అమాంతం పెంచేసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ వస్తుందని ఇప్పటికే ప్రకటించారు.