Waze Navigation App: టెక్నాలజీ మారిపోయింది. ఒకప్పుడు పోలీసులు వాహనాలను ఆపి చలాన్లు రాసేవారు. తరువాత కెమెరాలు వచ్చాయి. నగరాల్లోని కూడళ్లలో పోలీసులు కెమెరాల ద్వారా ఫొటోలు తీసి ఆన్లైన్‌లో చలానాలు విధిస్తున్నారు. పెద్ద నగరాల్లోని ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై స్పీడ్ కెమెరాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. వాటిని రహస్య ప్రాంతాల్లో పెట్టడం, వాహనదారుడు గమనించకపోవడం వల్ల చలాన్ పడుతుంది.