టాలీవుడ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఏపీలో టికెట్ ధరలపై కొత్త జీవో వస్తుందని ఆశించిన ‘భీమ్లా నాయక్’ నిరాశే ఎదురయ్యింది. అంతేనా సినిమా విడుదల సమయంలో ఏపీ థియేటర్ల వద్ద సీఆర్ఫీఎఫ్ జవాన్లు కన్పించడంపై చర్చ జరిగింది. కానీ ఏపీ మంత్రులు మాత్రం మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి కారణంగా జీవో వాయిదా పడిందని, కావాలంటే జీవో వచ్చేదాకా సినిమాను వాయిదా వేసుకుని ఉండాల్సింది అంటూ సమర్థించుకుంటున్నారు.…