నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (NMMSS) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ పొడిగించింది. తాజా ప్రకటన ప్రకారం, 2025 అక్టోబర్ 18 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అలాగే పరీక్ష ఫీజును కూడా చెల్లించవచ్చు. ఈ స్కాలర్‌షిప్ కోసం 2025-26 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇప్పటి వరకు దరఖాస్తు చేయని అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పక…
Group-1 : తెలంగాణ గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై వాదనలు త్వరగా ముగించాలని సంబంధిత న్యాయవాదులకు కోర్టు సూచించింది. నియామక పత్రాల కోసం అభ్యర్థులు నిరీక్షణలో ఉన్నారని హైకోర్టు గుర్తుచేసింది. పరీక్ష సమాధాన పత్రాల మూల్యాంకనంలో లోపాలు, తుది అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో తేడాలు ఉన్నట్లు పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో, పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నందున నియామక ప్రక్రియపై స్టే ఆదేశాలు జారీ చేసిన కోర్టు, ఇప్పుడు టీఎస్‌పీఎస్సీ దాఖలు చేసిన మధ్యంతర…