Gotabaya Rajapaksa Returns To Srilanka: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్స స్వదేశానికి తిరిగి వచ్చారు. దాదాపుగా 50 రోజులకు పైగా ప్రవాసంలో గడిపిన ఆయన స్వదేశం శ్రీలంకలో అడుగుపెట్టారు. రాజపక్స శుక్రవారం అర్థరాత్రి థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి సింగపూర్ మీదుగా కొలంబోలోని బండారు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టారు. రాజపక్స పార్టీ మద్దతుదారులు, నాయకులు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. భారీ సైనిక కాన్వాయ్ భద్రతలో కొలంబోలోని అతనికి కేటాయించిన ఇంటికి…