గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఆగస్టు 14న భారత్‌లో లాంచ్ కానుంది. ఈ సారి గూగుల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మాత్రమే కాకుండా మొత్తం నాలుగు పిక్సెల్ ఫోన్‌లు లాంచ్ కానున్నట్లు తెలిసింది. సమాచారం ప్రకారం.. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్‌లో పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఆగస్టు 14న భారత్‌లో ప్రారంభించబడతాయి.