ఎక్కువ మంది బ్లాక్ కాఫీని తాగడానికి ఇష్టపడతారు. ఈ కాఫీ తాగితే పని ఒత్తిడి తగ్గుతుంది. నీరసం, అలసట నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఇక ఉదయాన్నే పరగడుపున ఈ బ్లాక్ కాఫీ తాగితే మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి. రుచికి కాస్త చేదుగా ఉన్నా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. జర్నల్ ఆఫ్ క్లినికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ నివేదిక ప్రకారం.. బ్లాక్ కాఫీలో ఆల్కహాల్ లేని కొవ్వు కాలేయానికి వ్యతిరేకంగా రక్షించే రక్షిత సమ్మేళనాలు ఉన్నాయి.