బంగారం ధరలు మళ్లీ షాకిస్తున్నాయి. దీపావళి తర్వాత రెండు రోజులు తగ్గినట్టే తగ్గే మళ్లీ పరుగులు పెడుతోంది. దీంతో గోల్డ్ లవర్స్ బెంబేలెత్తిపోతున్నారు. ఇక రెండ్రోజుల పాటు స్వల్పంగా పెరిగిన ధరలు.. శనివారం మాత్రం భారీగా పెరిగిపోయాయి. తులం గోల్డ్‌పై రూ.1,250 పెరగగా.. వెండి ధర మాత్రం ఉపశమనం కలిగించింది.
దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ దందాను డీఆర్ఐ అధికారులు గుట్టు రట్టు చేశారు. డ్రగ్స్ తయారు చేసే పరిశ్రమపై అధికారుల బృందం దాడులు చేశాయి. రూ.108 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు.
పసిడి ప్రియులకు మళ్లీ షాక్. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. రెండు రోజులు పాటు పరుగులకు బ్రేక్‌లు పడ్డాయి. ధరలు తగ్గుముఖం పడతాయని అంతా భావించారు. కానీ రెండు రోజులకే మళ్లీ ధరలు షాకిచ్చాయి. శుక్రవారం స్వల్పంగా ధరలు పెరిగాయి. తులం గోల్డ్‌పై రూ.380 పెరగగా.. వెండి ధర మాత్రం ఉపశమనం కలిగిస్తుంది.
బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత కొద్దిరోజులుగా పరుగులు పెట్టిన పసిడి ధరలు రెండు రోజులుగా తగ్గు ముఖం పట్టాయి. దీంతో బంగారం ప్రియులు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. గురువారం తులం గోల్డ్‌పై రూ. 810 తగ్గగా.. కిలో వెండిపై రూ.1,000 తగ్గింది.
పసిడి ప్రియులకు శుభవార్త. గత కొద్దిరోజులుగా పరుగులు పెట్టిన బంగారం ధరలు శాంతించాయి. దీపావళికి ముందు జెట్‌స్పీడ్‌లో ధరలు దూసుకెళ్లాయి. ధరలు ఆకాశన్నంటడంతో బంగారం ప్రియులు లబోదిబో అన్నారు.
బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. రెండు రోజులు శాంతించిన ధరలు.. దీపావళి ముగియగానే తన పంథా కొనసాగిస్తోంది. మళ్లీ జెట్ స్పీ్డ్లా ధరలు దూసుకెళ్తున్నాయి. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.2,080 పెరగగా.. వెండి ధర మాత్రం కాస్త ఉపశమనం కలిగించింది. కిలో వెండిపై రూ.2,000 తగ్గింది.
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది. గత కొద్దిరోజులుగా మెరుపులు మెరిసిన బంగారం ధరలు దీపావళి రోజున కాస్త ఉపశమనం కలిగించింది. గోల్డ్, సిల్వర్ ధరలు నెమ్మదించాయి. తులం బంగారం ధరపై రూ. 170 తగ్గింది. సిల్వర్ ధర మాత్రం యధాస్థితిలో కొనసాగుతోంది.
గత కొద్దిరోజులుగా రాకెట్లా దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలకు బ్రేకులు పడ్డాయి. దీపావళికి బంగారం కొనుగోలు చేద్దామనుకున్న పసిడి ప్రియులకు శనివారం కాస్త ధరలు ఉపశమనం కలిగించాయి.
StoryBoard: దేశంలో ఇప్పుడు ఒకటే చర్చ…బంగారం…బంగారం. కొండెక్కుతున్న పసిడి ధరలను చూసి…మహిళామణులు ముక్కున వేలేసుకుంటున్నారు. పెరుగుతున్న పుత్తడి ధరలను చూసి…కొందరు షాక్ అవుతున్నారు. ఇంకొందరు…పండుగ చేసుకుంటున్నారు. ఏడాది క్రితం బంగారం కొన్న వారంతా…ఇప్పుడు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అప్పుడు కొనలేని వారు…బాధలో మునిగిపోయారు. 2024 డిసెంబరులో పసిడి తీసుకునే ఉంటే…ఇవాళ తామంతా లక్షాధికారులు అయిపోయేవాళ్లమని లోలోపల తమను తాము తిట్టుకుంటున్నారు. కనకం కమ్ డౌన్ అంటున్న దిగిరావడం రాలేదు. రోజురోజుకు పెరగడమే తప్పా…తగ్గడం అన్నది లేకుండా చిరుతలా…