PM Modi On Global Fintech: ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఫిన్‌టెక్ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర సర్కార్ అనేక విధానపరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో ఒకటి ఏంజిల్ ట్యాక్స్‌ను రద్దు చేయడం వల్ల.. గత పదేళ్లలో ఈ రంగం 31 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించిందని తెలిపారు.