కర్ణాటకలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కర్ణాటకలోని యాద్గిర్ ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని పాఠశాల వాష్‌రూమ్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక, శిశువు ఇద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బందిపై సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తునకు ఆదేశించారు ఉన్నతాధికారులు. ఈ విషయంపై కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుుడు శశిధర్ కోసాంబే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.…