GHMC Meeting: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో నేడు ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వార్డుల డీలిమిటేషన్‌కు సంబంధించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను అధికారులు సభలో ప్రవేశపెట్టనున్నారు. వార్డుల విభజన విధానం, దానిపై వచ్చిన అభ్యంతరాలు ఈ సమావేశంలో ప్రధాన అంశాలుగా నిలవనున్నాయి. వార్డుల పునర్విభజనపై నగర కార్పొరేటర్లు తమ అభ్యంతరాలు, సూచనలను సభలో స్పష్టంగా తెలియజేయనున్నారు. ఏ ప్రాతిపదికన వార్డుల విభజన చేపట్టారో తెలియట్లేదని, బౌండరీస్‌కు సంబంధించిన స్పష్టమైన మ్యాప్ అందించలేదని…