H-1B Visa Row: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా రుసుమును $100,000 (రూ. 88 లక్షలు)కు పెంచడం ఒక్కసారిగా భారతీయ టెక్కీలో ఆందోళన నింపింది. తమ అమెరికన్ డ్రీమ్స్‌ను ట్రంప్ కాలరాస్తున్నాడనే ఆవేదన వ్యక్తమైంది. H-1B వీసా ఫీజు పెంపు విషయం గందరగోళంగా మారుతున్న తరుణంలో మేము ఉన్నామంటూ ఓ యూరోపియన్ దేశం ముందుకు వచ్చింది. భారత టెక్కీలు తమ దేశానికి రావాలని ఆహ్వానించింది.