మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా మీద పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్, ఖైబర్ పఖ్తున్ఖ్వా (కెపి) ప్రావిన్షియల్ అసెంబ్లీలను రద్దు చేయమని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా తనకు సలహా ఇచ్చారని ఆయన చెప్పారు. ఆదివారం ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ కీలక విషయాలు చెప్పారు.