కరోనా నేపథ్యంలో గేట్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5 నుంచి గేట్ పరీక్షలు జరుగుతాయని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. షెడ్యూల్‌కు రెండు రోజుల ముందు పరీక్షలను రద్దు చేయడం విద్యార్థులను గందరగోళానికి, అనిశ్చితికి గురిచేస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం గేట్ పరీక్ష వాయిదాపై దాఖలైన పిటిషన్‌లపై…