ఈటలపై మరోసారి మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో 15 రోజులుగా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. ఈటెల రాజేందర్ మీద ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు ఫిర్యాదులు చేశారని..వెంటనే ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించడం ఈటెలను మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. హుజురాబాద్ నాయకులను ప్రజా ప్రతినిధులను డబ్బులిచ్చి కొంటున్నారు అంటూ ఈటల అనడం బాధాకరమని..టిఆర్ ఎస్ పార్టీ తరపున ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అమ్ముడుపోయారు అనడం బాధ కలిగిందన్నారు. టిఆర్ఎస్…