Uttar Pardesh: ఉత్తర్ ప్రదేశ్‌లో పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ముక్తార్ అన్సారీ, సంజీవ్ జీవా ముఠాలతో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ వ్యక్తి, షార్ప్ షూటర్ షారూఖ్ పఠాన్ హతమయ్యాడు. అనేక హత్యల కేసుల్లో ఇతను వాంటెడ్‌గా ఉన్నాడు. బెయిల్ తర్వాత పరారీలో ఉన్నాడు. ఆదివారం ముజఫర్ నగర్‌లో ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF)తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడని అధికారులు తెలిపారు.