హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీ ఊరేగింపులతో గణనాథులు హుస్సేన్ సాగర్‌కు తరలి వస్తున్నారు. ఊరేగింపు దారిలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తుగానే 160 యాక్షన్ టీమ్‌లను సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ... ఆ మార్గంలో దాదాపు 56,187 తాత్కాలిక లైట్లను అమర్చింది.
గణపయ్యలకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు.. గణపయ్యలకు బైబై చెబుతూ.. గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు.. గత రెండు మూడు రోజుల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులతో పాటు.. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కొనసాగుతుండగా.. ఈ రోజు కీలక నిమజ్జనం జరగనుంది..