అయోధ్యలోని రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి దేశ నలుమూలల నుంచి వేలాది మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. "మేము గాంధీ రాముడిని పూజిస్తాము, బీజేపీకి చెందిన రాముడిని కాదు" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.