Pawan Kalyan: ప్రజా గాయకుడు గద్దర్ నిన్న మృతి చెందిన విషయం తెల్సిందే. అల్వాల్‌లోని ఆయన ఇంటివద్ద జులై 20న తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అప్పటి నుంచి హాస్పిటల్ లోనే చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో ఒక్కసారిగా
అమ్మా తెలంగాణమా అంటూ అణువనువును తట్టిలేపిన ఆ స్వరం ఇక సెలవు తీసుకుంది. పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా అంటూ.. తెలంగాణ గోసకు పతాకమైన నిలిచి ఆ గానం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.
దళిత రచయిత, గద్దర్‌గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు ప్రముఖ విప్లవ కవి. తెలంగాణ ఉద్యమంలో తన పాటలతో ఎంతో కీలక పాత్ర పోషించిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ తుదిశ్వాస విడిచారు.