ఓం రౌత్ చిత్రం ఆదిపురుష్ విడుదలైన వెంటనే థియేటర్లలో ప్రకంపనలు సృష్టించింది. తొలిరోజే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా బిజినెస్ చేసింది (అన్ని భాషల లెక్కలతో కలిపి). దీనితో పాటు సన్నీ డియోల్ చిత్రం 'గదర్: ఏక్ ప్రేమ్ కథ' కూడా మంచి వసూళ్లను రాబడుతోంది.
ఒకే రోజు ఇద్దరు పేరున్న స్టార్ హీరోస్ సినిమాలు విడుదలై, రెండు చిత్రాలు విజయం సాధిస్తే చిత్రసీమకు ఓ పండగే అని చెప్పాలి. అలాంటి పండగలను ఇద్దరు స్టార్ హీరోలు బాలీవుడ్ కు రెండు సార్లు అందించారు. ఆ ఇద్దరు టాప్ స్టార్స్ ఎవరంటే ఆమిర్ ఖాన్, సన్నీ డియోల్. ఈ ఇద్దరు హీరోలు తొలిసారి 1990లో ఒకే రోజున పోటీ పడి సినీఫ్యాన్స్ ను మురిపించారు. తరువాత పదకొండు సంవత్సరాలకు 2001లో మరోమారు ఒకే రోజు…