Danam Nagendar: బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించనున్న సిల్వర్ జూబ్లీ మహాసభపై రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏప్రిల్ 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ మహాసభ విజయవంతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగే ఈ సభకు ప్రజలు భారీగా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌ను చూసేందుకు, ఆయన ఏమి మాట్లాడతారన్న విషయం…
CM Revanth Reddy : హైదరాబాద్ యూనివర్సిటీ భూములను లాక్కున్నట్లుగా సోషల్ మీడియా నెట్ వర్క్ కృత్రిమంగా వివాదం సృష్టించటం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.…