బ్రిస్బేన్‌లోని ప్రతిష్టాత్మక గబ్బా క్రికెట్ స్టేడియం శిథిలావస్థకు చేరుకుందని క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం ఎట్టకేలకు ప్రకటించింది. 2032 ఒలింపిక్స్ అనంతరం గబ్బా స్టేడియాన్ని కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2032 ఒలింపిక్స్ ఆతిథ్యం కోసం విక్టోరియా పార్క్ ప్రాంతంలో 63 వేల సామర్థ్యమున్న కొత్త స్టేడియంను నిర్మిస్తామని ప్రకటించిది. ఒలింపిక్స్ అనంతరం ఈ స్టేడియానికి క్రికెట్ తరలి వెళ్లనుంది. ఈ విషయాన్ని క్వీన్స్‌ల్యాండ్ ప్రిమియర్ డేవిడ్ క్రిసాఫుల్లి తాజాగా ప్రకటించాడు. 2032 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న క్వీన్స్‌ల్యాండ్…