Sandeep Reddy Vanga: అనిమల్ సినిమా తరువాత సందీప్ రెడ్డి వంగా నిజంగానే హీరోలా మారిపోయాడు. సినిమా గురించి ఎంతమంది ఎన్ని విధాలుగా విమర్శలు చేసినా.. వారందరికీ తనదైన రీతిలో కౌంటర్లు వేసి షాక్ లు ఇచ్చాడు. ఇక ఎప్పుడు ఏ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లని సందీప్.. నేడు గామి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్ళాడు.
Vishwak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్నాడు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లు చేయడంతో పాటు యూనిక్ కాన్సెప్ట్‌లతోనూ ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ధమ్కీ సినిమా తరువాత విశ్వక్ ప్రేక్షకుల ముందు రాలేదు. ఇక తాజాగా విశ్వక్ నటిస్తున్న చిత్రం గామి. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు.
Gaami: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గామి. షోరీల్ ట్రైలర్ ఈ రోజు ప్రసాద్స్‌లోని PCX స్క్రీన్‌లోగ్రాండ్ గా లాంచ్ చేశారు . సినిమా యొక్క గ్రాండ్ స్కేల్, గ్రాండియర్ ని ప్రజెంట్ చేయడానికి ఈ బిగ్ స్క్రీన్‌ని ఎంచుకున్నారు మేకర్స్. పిసిఎక్స్ ఫార్మాట్‌లో తొలిసారిగా విడుదల చేసిన ట్రైలర్‌ను మాన్‌స్ట్రస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేశారు.