Gaami: గామి అంటే అర్ధం అదే.. సీక్రెట్ రివీల్ చేసిన డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaami: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గామి. షోరీల్ ట్రైలర్ ఈ రోజు ప్రసాద్స్‌లోని PCX స్క్రీన్‌లోగ్రాండ్ గా లాంచ్ చేశారు . సినిమా యొక్క గ్రాండ్ స్కేల్, గ్రాండియర్ ని ప్రజెంట్ చేయడానికి ఈ బిగ్ స్క్రీన్‌ని ఎంచుకున్నారు మేకర్స్. పిసిఎక్స్ ఫార్మాట్‌లో తొలిసారిగా విడుదల చేసిన ట్రైలర్‌ను మాన్‌స్ట్రస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేశారు. కార్తిక్ కల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రౌడ్ ఫండ్ చేశారు. V సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది. విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం స్క్రీన్ ప్లే రాశారు.మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై షోరీల్ ట్రైలర్ చాలా క్యూరియాసిటీని పెంచింది. ఈ చిత్రంలో విశ్వక్ సరసన చాందిని చౌదరి నటించింది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసినప్పటి నుంచి అస్సలు గామి అంటే ఏంటి.. ? దాని అర్ధం ఏంటి.. ? అర్థంపర్థం లేని టైటిల్ గా అనిపిస్తుంది అని చాలా కామెంట్స్ వచ్చాయి. తాజాగా ట్రైలర్ ఈవెంట్ లో ఈ కామెంట్స్ మొత్తానికి డైరెక్టర్ విద్యాధర్ కగిత క్లారిటీ ఇచ్చాడు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ విద్యాధర్ కగిత మాట్లాడుతూ.. ” చిన్నగా మొదలై పెద్ద సినిమా అయ్యింది గామి. వంశీ గారు మమ్మల్ని బలంగా నమ్మారు. చాలా ఫ్రీడం ఇచ్చారు. సందీప్ అన్న చాలా హెల్ప్ చేశారు. గామి సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే ఎక్సయిట్మెంట్ క్రియేట్ అవుతుంది. గామి అనే ఏంటి అంటే.. గామి అంటే సీకర్.. గమ్యాన్ని గమించేవాడు గామి. మీనింగ్ ఉంది దానికి. అతనికి మానవ స్పర్శే పెద్ద భయం.. అదే అతనికి కోరిక కూడా మానవ స్పర్శనే.. ఇంతకన్నా ఈ స్టేజిమీద ఎక్కువ చెప్పలేను. విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కించాం. దాని కోసమే ఇన్నేళ్ళు కష్టపడ్డాం. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాం. మార్చి 8న కొత్తరం తెలుగు సినిమాని చూస్తారని కోరుకుంటునన్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read
- Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
- Shavukaru Janaki : వెండితెర 'షావుకారు' జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
- Arjun Reedy Ice Scene: 'ఐస్ వేసుకునే సీన్' రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
- Spirit: 'స్పిరిట్'లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
తాజావార్తలు
-
Ration Card Holders: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక 15 రోజుల్లోనే..
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!