పాముకాటుతో 22 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. అనంతరం.. అతని చితిపైనే కాటేసిన పామును సజీవ దహనం చేశారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం రోజు ఈ ఘటన జరిగింది. అయితే స్థానికులు.. పాము మరొకరికి హాని చేస్తుందనే భయంతో దానిని చితిపై కాల్చారు.
ఛత్తీస్‌గఢ్‌లో జవాన్ లే లక్ష్యంగా మావోయిస్టులు పేల్చిన మందుపాతరలో 10 మంది మరణించారు. ఈ ఘటనలో చనిపోయిన ఓ జవాన్ దహన సంస్కారాల్లో హృదయ విదారక దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. భర్త మృతిని తట్టుకోలేని మహిళ గుండెలవిసేలా రోదించింది.