నటుడు సత్యరాజ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి, గాంగేయం మాజీ ఎమ్మెల్యే అర్జునన్ సతీమణి కల్పన కన్నుమూశారు. గతకొద్దికాలంలాగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతిచెందారు. దీంతో సత్యరాజ్ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఏ. కల్పన సత్యరాజ్ కి రెండో చెల్లెలు.. ఆమె తిరుప్పూరు జిల్లా గాంగేయంలో నివసిస్తున్నారు. చెల్లెలి మరణ వార్త విన్న సత్యరాజ్ కుటుంబం హుటాహుటిన తిరుప్పూరుకి చేరుకున్నారు. ఇకపోతే తమిళ్ నటుడిగా పేరు గాంచిన…