బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఈరోజు రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తగా ఎన్నికైన అసెంబ్లీ తొలి సెషన్ ఈరోజు రాయ్‌పూర్‌లో ప్రారంభమైంది. 71 ఏళ్ల రమణ్ సింగ్ ఆదివారం స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఛత్తీస్‌గఢ్ విధానసభలో అందరినీ ఏకతాటిపైకి తీసుకెళ్లడం తన కొత్త బాధ్యత అని అన్నారు.