Keshub Mahindra: మన దేశంలో మంచి పేరు సంపాదించిన మల్టీ నేషనల్ కంపెనీల్లో మహింద్రా అండ్ మహింద్రా గ్రూప్ కూడా ఒకటి. వివిధ రంగాలపై ఆ సంస్థ చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదంటే అతిశయోక్తి కాదు. అయితే.. ఆ కంపెనీ సాగించిన అనితర సాధ్యమైన ఈ అద్భుత ప్రయాణంలో ఒక వ్యక్తి పోషించిన పాత్ర సైతం అసమానమైంది.