హైదరాబాద్ లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా మరో ఘోర ప్రమాదం జరిగింది..ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్‌లో నిర్మిస్తున్న ఓ నూతన ఫైఓవర్ నిర్మాణంలో అపశృతి చోటుచేసుకుంది. నిర్మాణం చేస్తుండగా ఒక్కసారిగా ఫ్లై ఓవర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులకు గాయాలవ్వగా.. వారందరిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.. ప్రమాద సమయంలో కూలీలు తమ పనుల్లో బిజీగా ఉన్నారు.. ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో అందరు ఉలిక్కి పడ్డారు.. ఇక ఘటనా స్థాలానికి ఇంజినీర్ల బృందం…
విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. ఈ నెల 10న బెంజ్ సర్కిల్ రెండో ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈ కార్యకమానికి సీఎం జగన్, ఇతర మంత్రులు హాజరవుతారు. దీంతో రెండో ఫ్లై ఓవర్ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు రహదారుల శాఖ మంత్రి శంకరనారాయణ, అధికారులు. ఈనెల 10న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 16వేల 500 కోట్లతో 1045 కిలోమీటర్లు…